
నేపాల్ తాత్కాలిక ప్రభుత్వంలోకి ముగ్గురు కొత్త మంత్రులు
నేపాల్‌లో అల్లర్లు, హింస తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. తాజాగా నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి సుశీల కర్కీ కేబినెట్ విస్తరణ చేశారు. కేబినెట్లోకి కొత్తగా ముగ్గురు మంత్రులను తీసుకున్నారు. ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధానమంత్రి సహా నలుగురు సభ్యులు ఉన్నారు. ఖాట్మాండులోని రాష్ట్రపతి భవన్లో సీతల్ నివాస్‌లో కుల్మాన్ ఘిసింగ్, ఓం ప్రకాష్ ఆర్యల్, రామేశ్వర్ ఖనాల్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికి, వివిధ వర్గాలలో విశ్వాసం నింపడానికి…