www.viraltelugu.com, Online News : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాలతో ముగిశాయి. ఈరోజు(బుధవారం) ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 386.47 పాయింట్ల నష్టంతో 81,715.63 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 112.60 పాయింట్లు నష్టపోయి 25,056.90 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, బీఈఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూశాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 88.71గా ఉంది.



