www.viraltelugu.com, Online News : ప్రపంచ వ్యాప్తంగా ఔషధ తయారీ నిపుణుల సేవలను గుర్తించే ఉద్దేశ్యంతో ఈరోజు ఔషధ నిపుణుల దినోత్సవం- PHARMACISTS DAY నిర్వహిస్తున్నారు. టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ లో 2009 వ సంవత్సరంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ కాంగ్రెస్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒక దేశ ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే ఔషధ నిపుణులు తమ మేధస్సుతో తయారు చేసే ఔషధాలు కీలక భూమిక పోషిస్తాయి. ఔషధాలను తయారు చేసి, అవి ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేసి, ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఫార్మసిస్టులు ఎంతగానో తోడ్పడతారు.



