వృద్ధాశ్రమంలో సేవామూర్తి లయన్‌ డా॥ నిమ్మల స్వామినాయుడు జన్మదిన వేడుక

సెప్టెంబర్‌ 17, వైరల్‌ తెలుగు : ఆరోగ్య రంగంలో సంపాదన కంటే సేవకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ… సుదీర్ఘ కాలంగా ఎన్నో రక్తదాన మరియు వైద్య శిబిరాలకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్న మెడికల్‌ ప్రాక్టీషనర్‌ లయన్‌ డా॥ నిమ్మల స్వామినాయుడు(72) జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నోబెల్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు నల్ల రామచందర్‌, ఉపాధ్యక్షులు సురేందర్‌ రెడ్డి, కార్యదర్శి బాలకృష్ణ జనార్థన్‌, కోశాధికారి తాటి శ్రీనివాసరావు, లియో కో`ఆర్డినేటర్‌ జనపరెడ్డి రవీందర్‌లు పాల్గొని డా॥ నిమ్మల స్వామినాయుడిని ఆత్మీయంగా సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్య రంగంలో స్వామినాయుడు చేస్తున్న స్వచ్ఛంద సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Share Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *