www.viraltelugu.com, Online News : త్యాగరాయ గానసభలో లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గొల్ల నర్సింహ్ములు డి.వి గోపాలకృష్ణ రాజకీయ కార్టూనిస్టు నారు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలయిన బండి రాములు రాజిరెడ్డి బొమ్మనపల్లి యం.సతీష్ కె.విజయానంద్ రుక్మిణి యం.వెంకటేష్, అల్లం రవికుమార్ కెఎస్సార్ ఫౌండేషన్ కొమ్మలపాటి శ్రీనివాసరావు మహ్మద్ సల్లావుద్దిన్ శరచంద్ర వైష్ణవి రుత్విక్ తదితరులు అవార్డులను అందుకున్నారు. అవార్డు గ్రహీతలకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియచేశారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చిల్ల రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ చిరుతల రామాయణం లాంటి ప్రాచీన కళలను గుర్తించిన మెగా రికార్డ్స్ ఫౌండర్ ఈ కార్యక్రమ నిర్వాహకులు అయిన శ్రీనివాస్ అభినందనీయులు ఇక్కడ ప్రదర్శించిన కూచిపూడి నృత్యం, యోగా విన్యాసాలు అద్భుతంగా వీక్షకులను అలరించాయి అన్నారు. గొల్ల నర్సింహ్ములు, గోపాలకృష్ణ మాట్లాడుతూ, క్రమశిక్షణ కలిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎనభై యేండ్ల వయస్సుగల బండి రాములు యోగ సాధన విన్యాసాలు చూస్తుంటే రోమాంచితంగానూ, రుత్విక్ ఏకపాత్రాభినయం కూచిపూడి నృత్య ప్రదర్శన అమోఘమైన వీక్షణానుభూతిని కలిగించాయి అన్నారు.



