Saturday, April 11, 2026
spot_img
Homeతెలంగాణమెగా రికార్డ్స్ వారి ఉగాది పురస్కారాలు

మెగా రికార్డ్స్ వారి ఉగాది పురస్కారాలు

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు నందుగల కళాభారతి సిటీ కల్చరల్ ఆడిటోరియంలో మెగారికార్డ్స్ వారి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ జడ్జి బూర్గుల మధుసూదన్ , సభాధ్యక్షులుగా చిల్లా రాజశేఖర్ గారు , అతిథులుగా గోపాలకృష్ణ నాయుడు , అష్టసాముద్రిక సరస్వతి వంశీ ప్రసాద్ ఎలైడ్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ అసోసియేషన్ ఫౌండర్, తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జిసి రెడ్డి. చిత్రపురి కాలనీ ఈడబ్ల్యూఎస్ జాయింట్ సెక్రటరీ టి. ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ముఖ్య అతిథి బూర్గుల మధుసూదన్ మాట్లాడుతూ కూచిపూడి నాట్యం చేసే చిన్నారులను చూసి నేను చాలా ముగ్ధున్ని అయ్యానని , వారికి నేర్పిన గురువులను అభినందించారు. అదేవిధంగా అధ్యక్షులు చిల్లా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది పర్వదినం ఇంత చక్కటి కార్యక్రమం జరగటం అభినందనీయం ఈ కార్యక్రమం నిర్వహించిన మెగా రికార్డ్స్ వారికి వారి యొక్క అభినందనలు తెలియజేశారు, చిన్నారుల భరతనాట్యం, కూచిపూడి నాట్యము యోగ విన్యాసాలు, అదేవిధంగా సంధ్య డాన్స్ ప్రదర్శన చాలా ఆనందాన్ని కలిగించాయి వారు తెలియజేశారు , వంశీ ప్రసాద్ మాట్లాడుతూ నర్సింగ్ పారామెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలపై నిత్యం పోరాడుతున్నాము వారు మాట్లాడారు . జి సి రెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రికల్ కాంట్రాక్టు వాళ్ళ యొక్క సంక్షేమ కోసం వాళ్లు పడుతున్నటువంటి సమస్య కు వర్క్ షాప్ నిర్వహించటం ట్రైనింగ్స్ ఇవ్వటం లో మా యూనియన్ నిత్యం అందుబాటులో ఉంటుంది అని వారు తెలియజేశారు, గోపాల్ కృష్ణ నాయుడు గారు వారు మాట్లాడుతూ మీ యొక్క వర్తమానం భూత భవిష్యత్తు ఏదైతే ఉందో మీ యొక్క హస్తంలో ఉన్న రేఖలపై ఆధారపడి ఉంటుంది , ఒక క్రమశిక్షణ జీవితాన్ని అలవాటుపడితే మనం ఈ జన్మను సార్ధకం చేసుకున్నట్లుగా ఉంటుందని అని వారు తెలియజేశారు, మంజీరా అకాడమీ డైరెక్టర్ రేణుక ప్రభాకర్ మాట్లాడుతూ మా పిల్లలకు వారి నైపుణ్యం ప్రదర్శన చేసే అవకాశం ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు.
చిత్రపురి కాలనీ జాయింట్ సెక్రెటరీ టి. ధనరాజ్ మాట్లాడుతూ చిత్రపురి కాలనీ లో ఉన్నటువంటి సమస్యలపై నిత్యం పోరాడుతూ, అభివృద్ధికి అనేక విధాలుగా పనిచేస్తూ తోడ్పడుతున్నామని వారు అన్నారు, ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ తెలంగాణ ఎలక్ట్రికల్ అసోసియేషన్ నక్క యాదగిరి కూడా పాల్గొన్నారు .


ఈనాటి పురస్కారాలు గ్రహీతలు రుక్మంగడరావు మాట్లాడుతూ తంత్ర జ్యోతిష్యం దైనందిదన జీవితంలో అడ్వాన్స్గా మనందరికీ చాలా ఉపయోగపడుతుందని , ఈ తంత్ర జ్యోతిష్యం ఎలా ఉపయోగపడుతుందో వివరించారు, అదేవిధంగా జీవ శాస్త్ర ఉపాధ్యాయులు బుచ్చిలింగం మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధించాలని అదేవిధంగా ఆర్గానిక్ కూరగాయలు దేహానికి మంచిదని వారు తెలియజేశారు, వారితోపాటు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సత్య కాశబ్ ,శరత్ చంద్ర వైష్ణవి, రుక్మిణి, అనురాధ గాడ్గిల్ , శ్రీనివాస్ గౌడ్ గారు , ఏ. మహేందర్, నామిని వెంకటేష్, సంధ్య రవి , వేల్పుల విద్య శ్రీ , ఇసుకపట్ల గౌరీ జశ్విక, డి. వెంకట త్రివిక్రమ్, ఆర్. పూర్ణ శేఖర్

Admin
Admin
Viral Telugu is news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments