www.viraltelugu.com, Online News : లయన్స్ క్లబ్ District 320H డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ గంపా నాగేశ్వర రావు కాబినేట్ లో లియో క్లబ్ కోఆర్డినేటర్ గా లయన్ జనపరెడ్డి రవీందర్ 2025–26 సంవత్సరానికి బాధ్యతలు స్వీకరించారు.
యువతలో సేవా భావం, నాయకత్వ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు లియో క్లబ్ ముఖ్యపాత్ర పోషిస్తోంది. సమాజ సేవలో భాగస్వామ్యం అవుతూ, కొత్త అనుభవాలు సేకరించి, భవిష్యత్తులో సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవడానికి లియో క్లబ్ ఒక విశిష్ట వేదికగా నిలుస్తోంది. లియో క్లబ్ ద్వారా యువత సమాజానికి ఉపయోగపడుతూ, సానుకూల మార్పులు తీసుకువస్తున్నారు. సేవా దృక్పథంతో ముందుకు సాగే ఈ వేదిక, యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది.

డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ గంపా నాగేశ్వరావుతో లయన్ జనపరెడ్డి రవీందర్
లయన్ జనపరెడ్డి రవీందర్ 2017లో లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా కమలానగర్ లో లయనిజం లో చేరి, 2019–20లో ప్రెసిడెంట్, 2020–21లో DS ఇంజనీర్స్ హానరింగ్ అందుకున్నారు. Zone Chairperson (2021-22) District 320 C. మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆసరాకు చార్టర్ కార్యదర్శి. డిస్ట్రిక్ట్ 320 H చైర్‌పర్సన్ యూత్ అండ్ ర్యాలీలు (2024-25) మరియు Director లయన్స్ క్లబ్ ఆఫ్ Hyderabad నోబెల్. ప్రస్తుతం జిల్లా లియో కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ 320 H గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం District Leo Coordinator మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆసరా చార్టర్ సెక్రటరీగా సేవలందిస్తున్నారు.
వృత్తిపరంగా లయన్ రవీందర్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్. గతంలో NI-MSMEలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా సేవలందించారు. సమాజ సేవలో భాగంగా, ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు తెలుగులో ఎక్కువ మార్కులు సాధించినవారికీ, నిరుద్యోగ యువతకు కౌన్సెలింగ్, ప్రోత్సాహం మరియు మద్దతు అందిస్తున్నారు. ఎంట్రప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు, జాబ్ మేళాలు నిర్వహణలో చురుకుగా పాల్గొంటున్నారు.
సామాజిక సేవా దృక్పథంతో లయన్ జనపరెడ్డి రవీందర్ “సత్యశ్రీ ఫౌండేషన్” చారిటబుల్ ట్రస్ట్‌లో చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. లియో క్లబ్ ద్వారా యువతలో సేవాభావం, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించే కార్యాచరణలో ముందంజలో ఉంటారు.
లయన్ జనపరెడ్డి రవీందర్ నాయకత్వంలో, District 320H లియోస్ యువత సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తూ, సానుకూల మార్పులను తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు.



