www.viraltelugu.com, Online News : విజయవాడలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రీ కాత్యాయనీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ జిల్లా జి. లక్ష్మిశ భక్తులతో కలిసి క్యూలైన్లో వెళుతూ వారితో మాట్లాడి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు క్యూలైన్లలోని భక్తులకు మంచినీరు, పాలు వంటివి పంపిణీ చేస్తున్నామన్నారు.దర్శనానంతరం లడ్డు విక్రయ కేంద్రాలు, అన్న ప్రసాద స్వీకరణ కేంద్రాలలో రద్దీని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కనకదుర్గమ్మ శ్రీ కాత్యాయనీ దేవి అలంకారం
RELATED ARTICLES



