www.viraltelugu.com, Online News : ఆసియా కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఫైనల్‌పై దృష్టి సారించింది. సూపర్-4లో భాగంగా ఈరోజు సాయంత్రం తన రెండో మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. తొలి మ్యాచ్‌లో పాక్‌ను చిత్తు చేసిన సూర్య కుమార్ సేన ఈ పోరులో గెలిస్తే ఫైనల్లో చోటు ఖాయమే. అటు బంగ్లా కూడా శ్రీలంకపై విజయంతో ఆత్మవిశ్వాసంతోనే ఉంది. కానీ, గణాంకాలను పరిశీలిస్తే టీమిండియాకు ఇది కూడా ఏకపక్ష మ్యాచ్‌గానే పరిగణించవచ్చు. ఎందుకంటే బంగ్లాతో ఆడిన 17 టీ20ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఓడింది. ఏ విభాగంలో చూసినా ప్రత్యర్థి కన్నా భారత జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు గత రికార్డులు ఎలా ఉన్నా భారత్‌ను ఓడించగల సత్తా తమ జట్టుకు ఉందని బంగ్లాదేశ్ కోచ్ సిమన్స్ అంటున్నారు.
మరోవైపు సూపర్-4లో పాకిస్థాన్ కీలక విజయం అందుకుంది. ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంకపై కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో పాకిస్తాన్ 18 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా హుస్సేన్ తలత్ నిలిచాడు. ఈ ఓటమితో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక ఆసియాకప్‌నుంచి దాదాపుగా నిష్క్రమించినట్టే.



