www.viraltelugu.com, Online News : హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో హెచ్‌సీఏ హెల్త్‌కేర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. అమెరికన్ హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రొవైడర్‌గా HCA హెల్త్‌కేర్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కేపబిలిటీ సెంటర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, అనలిటిక్స్ రంగాలలో ప్రతిభావంతులను తీర్చిదిద్దడంపై దృష్టి సారించనుంది. 2025 చివరి నాటికి హెచ్‌సీఏ హెల్త్ కేర్ గ్లోబర్ కేపబిలిటీ సెంటర్ హైదరాబాద్‌లో 75 మిలియన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సెంటర్ ద్వారా ఈ ఏడాదిలో 1,200, వచ్చే ఏడాది మరో 3 వేల మందికి ఉపాధి లభించనుంది. హెచ్‌సీఏ హెల్త్‌కేర్ అమెరికా, యూకేలో ప్రధాన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఈ సంస్థకు 190 ఆసుపత్రులు, 2,400 కేర్ సైట్లు, 3.16 లక్షల ఉద్యోగులు ఉన్నారు. సంస్థ వార్షిక ఆదాయం 70 బిలియన్ డాలర్లు ఉంది.



