వికారాబాద్ జిల్లాలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అధికారుల పర్యటన

గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ పురోగతి అభివృద్ధి చెందినట్లుగా అవుతుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు. గత రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పంచాయతీరాజ్ విభాగ  ప్రజాప్రతినిధులు, ఆ రాష్ట్ర అధికారులు  జిల్లాలోని పలు గ్రామపంచాయతీల పనితీరును పరిశీలించారు. ఈ మేరకు  28 మందితో కూడిన బృందం జిల్లాలోని పూలుముర్ది, లింగంపల్లి, నవాబ్‌పేట్ పరిధిలోని గ్రామ పంచాయతీలను పరిశీలించారు. గ్రామంలో ఉన్న క్లీన్ అండ్ గ్రీన్,…

Read More

నేడు ఇంజనీర్ల దినోత్సవం

ప్రతి ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన ఇంజనీర్ల ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ఇండియాలో ఇంజనీర్ల దినోత్సవం జరుపుతున్నారు. భారతరత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 15న ఇంజనీర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యని భారతీయ ఇంజనీరింగ్‌ రంగానికి పితామహుడుగా అభివర్ణించవచ్చు. తన నైపుణ్యాలతో, ఇంజనీరింగ్‌ విద్యా పరిజ్ఞానంతో దేశాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తూ దేశానికి సారథ్యం వహించారు. విశ్వేశ్వరయ్య కర్ణాటకలోని మైసూర్‌ దగ్గర ముడినేహల్లి అనే కుగ్రామంలో 1861లో…

Read More

బండి సంజయ్‌పై కేటీఆర్ పరువు నష్టం దావా

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని.. నిరాధారమైనవని.. అవి తన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయంటూ కేటీఆర్ పిటిషన్ వేశారు. తనకు బహిరంగ క్షమాపణతో పాటు రూ.10 కోట్లు చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ, ప్రజల్లో తన ప్రతిష్టను దిగజార్చడానికి…

Read More

పోక్సో కేసులో నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందతుడు 21 ఏళ్లు జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధించింది. అలాగే బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని నల్గొండ పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి రోజారమణి ఆదేశించింది. 2018 ఫిబ్రవరిలో ఎనిమిదేళ్ల బాలికపై నిందతుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే ఏడాది అతడిపై చిట్యాల పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే 2022…

Read More

నాలాల కబ్జాల వల్లే వరదల సమయంలో విపత్తులు: హైడ్రా కమిషనర్

హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ఆఫ్జల్ సాగర్‌లో ఇద్దరు గల్లంతయ్యారని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, కాలనీలు వరద నీటితో నిండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆసిఫ్‌ నగర్‌లోని అఫ్జల్‌ సాగర్‌ నాలాలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆఫ్జల్ సాగర్ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన పరిస్థితిని…

Read More
Bandi Sanjay

హిందీ భాష భారత సంస్కృతికి ప్రతిరూపం: బండి సంజయ్

హిందీ కేవలం ఒక భాష మాత్రమే కాదు. కోట్లాది భారతీయుల భావోద్వేగాలు, సంస్కృతికి ప్రతిరూపం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. ‘హిందీ దివస్’ను పురస్కరించుకుని ఈరోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో హిందీ భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర న్యాయ రాష్ట్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్,…

Read More

పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చటంతో పాటు భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్‌మెంట్‌ ఉండాలని దూరాభారం తగ్గించి, అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలని సూచించారు. తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల…

Read More

దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పుష్కర…

Read More