నేపాల్ తాత్కాలిక ప్రభుత్వంలోకి ముగ్గురు కొత్త మంత్రులు

నేపాల్‌లో అల్లర్లు, హింస తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. తాజాగా నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి సుశీల కర్కీ కేబినెట్ విస్తరణ చేశారు. కేబినెట్‌లోకి కొత్తగా ముగ్గురు మంత్రులను తీసుకున్నారు. ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధానమంత్రి సహా నలుగురు సభ్యులు ఉన్నారు. ఖాట్మాండులోని రాష్ట్రపతి భవన్‌లో సీతల్ నివాస్‌లో కుల్మాన్ ఘిసింగ్, ఓం ప్రకాష్ ఆర్యల్, రామేశ్వర్ ఖనాల్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికి, వివిధ వర్గాలలో విశ్వాసం నింపడానికి…

Read More

నేడు ఇంజనీర్ల దినోత్సవం

ప్రతి ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన ఇంజనీర్ల ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ ఇండియాలో ఇంజనీర్ల దినోత్సవం జరుపుతున్నారు. భారతరత్న అవార్డు గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 15న ఇంజనీర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యని భారతీయ ఇంజనీరింగ్‌ రంగానికి పితామహుడుగా అభివర్ణించవచ్చు. తన నైపుణ్యాలతో, ఇంజనీరింగ్‌ విద్యా పరిజ్ఞానంతో దేశాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తూ దేశానికి సారథ్యం వహించారు. విశ్వేశ్వరయ్య కర్ణాటకలోని మైసూర్‌ దగ్గర ముడినేహల్లి అనే కుగ్రామంలో 1861లో…

Read More
Bandi Sanjay

హిందీ భాష భారత సంస్కృతికి ప్రతిరూపం: బండి సంజయ్

హిందీ కేవలం ఒక భాష మాత్రమే కాదు. కోట్లాది భారతీయుల భావోద్వేగాలు, సంస్కృతికి ప్రతిరూపం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. ‘హిందీ దివస్’ను పురస్కరించుకుని ఈరోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో హిందీ భాషా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర న్యాయ రాష్ట్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్,…

Read More

శ్రీ మాతా వైష్ణోదేవి యాత్ర మరోసారి వాయిదా

జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మాతా వైష్ణోదేవి యాత్రకు ఆటంకాలు తప్పడం లేదు. భారీ వర్షాల కారణంగా యాత్రను తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకూ సస్పెండ్ చేస్తున్నట్టు టెంపుల్ బోర్డు శనివారం ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 14 నుంచి తిరిగి యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ‘భవన్ ట్రాక్ వద్ద ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నందున 14వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన వైష్ణోదేవి యాత్రను మరోసారి వాయిదా వేస్తున్నాం.’ అని శ్రీ…

Read More

బాక్సింగ్‌లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్

యునైటెడ్ కింగ్ డమ్ లివర్ పూల్ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్‌లో మీనాక్షి హుడా విజేతగా నిలిచి స్వర్ణ పతకం గెలిచారు. కజకిస్థాన్‌కు చెందిన నజీమ్ కైజైబేను 4-1 తేడాతో మీనాక్షి ఓడించారు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలో దిగిన మీనాక్షి హుడా స్వర్ణ పోరుకు అర్హత సాధించడమే కాకుండా ఫైనల్‌లో బంగారు పతకం సాధించింది. కాగా బాక్సింగ్  విభాగంలో భారత్…

Read More

అస్సాంలో 5.8 తీవ్రతతో భారీ భూకంపం

అస్సాం రాష్ట్రంలో  భూకంపం సంభవించింది. ఈరోజు(ఆదివారం) సాయంత్రం 4:41 గంటలకు రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూమి కంపించింది. ఉదల్‌గిరి జిల్లాలోని ధెకియజులి ప్రాంతానికి 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని చెప్పారు. భూకంప తీవ్రతకు పలు ఇళ్లు స్వల్పంగా ఊగినట్టు సమాచారం. అయితే, ఇప్పటివరకు ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, చైనాలోనూ భూ…

Read More

స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో చేరిన ఆయుష్ మంత్రిత్వ శాఖ

మహిళల ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రారంభించనున్న ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌’లో ఆయుష్ మంత్రిత్వ శాఖ పాల్గొంటోంది. 16 రోజుల పాటు జరిగే ఈ జాతీయ ప్రచారం.. మహిళల ఆరోగ్యం, పలు వ్యాధులకు స్క్రీనింగ్‌పై దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, ఆయుష్ పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, సంఘాలు, NGOలు వంటి ఇతర వాటాదారుల సహకారంతో…

Read More