www.viraltelugu.com, Online News : గిగ్ వర్కర్స్‌కు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అభయ హస్తం డిక్లరేషన్‌లో గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు(బుధవారం) తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను తెలంగాణ గిగ్ అండ్ ఫ్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ సభ్యులు కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయడం లేదన్నారు. గిగ్ వర్కర్స్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, బీమాతో కూడిన సామాజిక భద్రత, సరైన వేతనాలతో పాటు మరణించిన కార్మికులకు పరిహారం చెల్లింపు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో గిగ్ వర్కర్స్ కోసం ప్రత్యేక డిక్లరేషన్ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ హామీల అమలు బాధ్యతను తీసుకుంటానన్న రాహుల్ గాంధీ, వీరి సమస్యలపై వెంటనే స్పందించాలని కోరారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవలు అందించిన గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ ద్రోహం చేస్తోందని విమర్శించారు. గిగ్, ప్లాట్‌ఫాం కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కేటీఆర్ తెలిపారు.



