www.viraltelugu.com, Online News : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయం దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న వారికి వేదపండితులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం -టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్ వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి ప్రారంభించారు. భక్తుల కోసం టీటీడీ కొత్తగా నిర్మించిన వెంకటాద్రి నిలయం యాత్రికుల భవన సముదాయాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించగా.. టీటీడీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్నిముఖ్యమంత్రి ప్రారంభించారు.
శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, చంద్రబాబు నాయుడు
RELATED ARTICLES



