www.viraltelugu.com, Online News : సమగ్రమైన వైద్య చికిత్స పద్ధతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈ రోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2016లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటినుండి ప్రతి యేటా సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటారు. నివారణ ప్రధానమైన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద వైద్య చికిత్స పద్ధతి ఓ కీలక పాత్రను పోషిస్తోంది.యువత, దేశ ప్రజలు ఆయుర్వేదాన్ని జీవన విధానంగా స్వీకరించేలా పలు కార్యక్రమాల ద్వారా ఈరోజు అవగహన కల్పిస్తారు.



