www.viraltelugu.com, Online News : లయన్స్ క్లబ్ అనేది అనేక దేశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. 1917లో అమెరికాలో స్థాపితమైన ఈ క్లబ్ ప్రస్తుతం 200కి పైగా దేశాల్లో విస్తరించి ఉంది. సామాజిక సేవే లక్ష్యంగా, కంటి ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, సహాయ కార్యక్రమాలు వంటి ఎన్నో సేవా చర్యలు చేపడుతుంది. స్థానిక సమస్యలను గుర్తించి, అవయవ దానం, వైద్య సహాయం, అభ్యుదయ కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి లయన్స్ గా పిలవబడే ఈ సంస్థ సభ్యులు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నోబెల్ లియో కోఆర్డినేటర్ లయన్ జనపరెడ్డి రవీందర్ పుట్టినరోజు సందర్భంగా, శ్రీ కాలనీలో వృద్ధులకు అల్పాహారం మరియు మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1వ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అశోక్ కుమార్ స్వైన్, ZC లయన్ V. మల్లేష్, Ln డాక్టర్ N.V. స్వామి నాయుడు, Dr. శ్రీలత, Ln T. శ్రీనివాస్ రావు (కోశాధికారి), మరియు Ln B. జనార్ధన్ (కార్యదర్శి) పాల్గొన్నారు.



