Saturday, November 15, 2025
spot_img
Homeజాతీయంతమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు

తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు

www.viraltelugu.com, Online News : తమిళనాడులో బాంబు బెదింపులు కలకలం రేపుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లతో సహా పలు ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి, నటుడు, టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష నివాసాలతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం, డీజీపీ కార్యాలయం, రాజ్‌భవన్‌కు బెదరింపు కాల్స్ వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పదమైన వస్తువులు దొరకలేదని భద్రతా అధికారులు తెలిపారు.  గురువారం రాత్రి చెన్నై విమానాశ్రయ మేనేజర్ కార్యాలయానికి బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఈ ఇమెయిల్‌లో విమానాశ్రయంలోని చెత్త డబ్బాలలో శక్తివంతమైన బాంబులు అమర్చామని, అవి ఏ క్షణమైనా పేలిపోతాయని పేర్కొన్నారు. బెదిరింపు ఇమెయిల్ తర్వాత, విమానాశ్రయ అధికారులు వెంటనే చెన్నై విమానాశ్రయ డైరెక్టర్‌ను అప్రమత్తం చేశారు. అర్ధరాత్రి విమానాశ్రయంలో అత్యవసర భద్రతా సమావేశం ఏర్పాటు చేశారు. తనిఖీల్లో అనుమానాస్పదంగా ఏం కనిపించకపోవడంతో బెదిరింపు బూటకమని తేలింది. ఈ ఘటనపై చెన్నై విమానాశ్రయ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

అయితే, గతంలో తమిళనాడు సీఎం నివాసానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆగస్టు 15న జెండా ఎగురవేసే కార్యక్రమానికి ముందు స్టాలిన్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. జూలైలోనూ ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నై నివాసానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. ఈ మేరకు కమిషనర్ కార్యాలయం కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చింది. అందులో నిందితుడు ముఖ్యమంత్రి ఇంట్లో బాంబు పెట్టినట్లు చెప్పాడు. తర్వాత ఈ బెదింరుపు బూటకమని తేలింది. 2024లోనూ స్టాలిన్ శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. దర్యాప్తులో ఇది కూడా నకిలీదని తేలింది. ఇలా స్టాలిన్‌కు తరచుగా బాంబు బెదిరింపులు వస్తుండటంతో ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Admin
Admin
Viral Telugu is news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments