www.viraltelugu.com, Online News : హెచ్1బీ వీసా ఫీజును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష డాలర్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారతీయ నిపుణులను ఆకర్షించేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా భారత్‌లోని జర్మనీ రాయబారి ఫిలిప్ అకెర్‌మన్.. నైపుణ్యం కలిగిన భారతీయులను తమ దేశంలోకి ఆహ్వానిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ‘అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయులందరికీ ఇది మా ఆహ్వానం. జర్మనీ దాని స్థిరమైన వలస విధానాలను కలిగి ఉంది. దీంతో పాటు ఐటీ, సైన్స్, సాంకేతిక రంగాల్లో భారతీయులకు మంచి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. మా దేశంలో పనిచేసే భారతీయులు జర్మన్‌ల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అధిక వేతనాలతో వారు జర్మనీ సంక్షేమానికి ఉపయోగపడుతున్నారు. మేము హార్డ్‌వర్క్, ఉత్తమమైన వ్యక్తులకు మంచి ఉద్యోగం ఇవ్వడం అనేదాన్ని నమ్ముతాం.’ అని ఫిలిప్ పేర్కొన్నారు. జర్మనీ వలస విధానం సరళంగా, ఆధునికంగా ఉందన్నారు. తమ విధానాల్లో ఆకస్మిక మార్పులు ఉండవన్నారు. ఈ క్రమంలోనే మంచి ఉద్యోగాల కోసం భారతీయులు తమ దేశానికి రావాలని జర్మనీ రాయబారి ఫిలిప్ అకెర్‌మన్ పిలుపునిచ్చారు.
హెచ్1బీ వీసా ఫీజుల వేళ.. భారత నిపుణులకు జర్మనీ పిలుపు
RELATED ARTICLES



