స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో చేరిన ఆయుష్ మంత్రిత్వ శాఖ

మహిళల ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రారంభించనున్న ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌’లో ఆయుష్ మంత్రిత్వ శాఖ పాల్గొంటోంది. 16 రోజుల పాటు జరిగే ఈ జాతీయ ప్రచారం.. మహిళల ఆరోగ్యం, పలు వ్యాధులకు స్క్రీనింగ్‌పై దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, ఆయుష్ పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, సంఘాలు, NGOలు వంటి ఇతర వాటాదారుల సహకారంతో దీనిని నిర్వహించనున్నారు.    ఈ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్, రక్తహీనత, క్షయవ్యాధి, సికిల్ సెల్ వ్యాధి వంటి అంటువ్యాధి కాని వ్యాధులకు ఆరోగ్య తనిఖీలు, స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించనున్నారు. ఇది జీవనశైలి మార్గదర్శకాలు, యోగా సెషన్లు, ప్రకృతి పరీక్ష ద్వారా మహిళల ఆరోగ్యం, సాధికారతను కూడా నొక్కి చెబుతుంది. ఆయుర్వేద స్ఫూర్తితో వెల్‌నెస్ కార్యక్రమాలు, యోగా ఆధారిత మైండ్‌ఫుల్‌నెస్ సాధనలను ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఇంటి చిట్కాలు, పోషకాహార కిట్లను ప్రజలకు పంపిణీ చేస్తామని పేర్కొంది. మహిళల శ్రేయస్సు కోసం సాధారణ ఔషధ మొక్కలు, మూలికా టీల ఆరోగ్య ప్రయోజనాలను వివిధ కార్యకలాపాల ద్వారా హైలైట్ చేస్తామని తెలిపింది.    రోజువారీ ఆయుష్ ఆరోగ్య చిట్కాలను అందించడం, సమగ్ర శ్రేయస్సును ప్రోత్సహించడం ద్వారా గర్భధారణ నుంచి ఉపశమన సంరక్షణ వరకు మహిళలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణను నిర్ధారించడం ఈ ప్రచారం లక్ష్యమని మంత్రిత్వ శాఖ వెల్లంచింది.

మహిళల ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రారంభించనున్న ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌’లో ఆయుష్ మంత్రిత్వ శాఖ పాల్గొంటోంది. 16 రోజుల పాటు జరిగే ఈ జాతీయ ప్రచారం.. మహిళల ఆరోగ్యం, పలు వ్యాధులకు స్క్రీనింగ్‌పై దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, ఆయుష్ పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, సంఘాలు, NGOలు వంటి ఇతర వాటాదారుల సహకారంతో దీనిని నిర్వహించనున్నారు. 

 ఈ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్, రక్తహీనత, క్షయవ్యాధి, సికిల్ సెల్ వ్యాధి వంటి అంటువ్యాధి కాని వ్యాధులకు ఆరోగ్య తనిఖీలు, స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించనున్నారు. ఇది జీవనశైలి మార్గదర్శకాలు, యోగా సెషన్లు, ప్రకృతి పరీక్ష ద్వారా మహిళల ఆరోగ్యం, సాధికారతను కూడా నొక్కి చెబుతుంది. ఆయుర్వేద స్ఫూర్తితో వెల్‌నెస్ కార్యక్రమాలు, యోగా ఆధారిత మైండ్‌ఫుల్‌నెస్ సాధనలను ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఇంటి చిట్కాలు, పోషకాహార కిట్లను ప్రజలకు పంపిణీ చేస్తామని పేర్కొంది. మహిళల శ్రేయస్సు కోసం సాధారణ ఔషధ మొక్కలు, మూలికా టీల ఆరోగ్య ప్రయోజనాలను వివిధ కార్యకలాపాల ద్వారా హైలైట్ చేస్తామని తెలిపింది. 

 రోజువారీ ఆయుష్ ఆరోగ్య చిట్కాలను అందించడం, సమగ్ర శ్రేయస్సును ప్రోత్సహించడం ద్వారా గర్భధారణ నుంచి ఉపశమన సంరక్షణ వరకు మహిళలకు సమగ్ర ఆరోగ్య సంరక్షణను నిర్ధారించడం ఈ ప్రచారం లక్ష్యమని మంత్రిత్వ శాఖ వెల్లంచింది.

Share Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *