ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందతుడు 21 ఏళ్లు జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధించింది. అలాగే బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని నల్గొండ పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి రోజారమణి ఆదేశించింది.
2018 ఫిబ్రవరిలో ఎనిమిదేళ్ల బాలికపై నిందతుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే ఏడాది అతడిపై చిట్యాల పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే 2022 నుంచి నల్గొండ పోక్సో కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. తాజాగా విచారణ అనంతరం కోర్టు తీర్పును వెలువరించింది. దోషికి జైలు శిక్షతో పాటు బాధితురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో బాధిత కుటుంబం సంతృప్తి వ్యక్తం చేసింది.