www.viraltelugu.com, Online News : కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ చేపట్టిన తర్వాత పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు. అందులో 30 మందిపై రూ.64 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేయడం, ప్రభుత్వ పునరావాస విధానం అమలుతో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. వీరంతా గతంలో అనేక విధ్వంసక ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు బస్తర్ ఐజీ తెలిపారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని స్థానిక అధికారులు స్పష్టం చేశారు. మావోయిస్టులు హింసాయుత విధానాలు వదిలివేసేలా చేయడమే తమ ఉద్దేశమని.. జనజీవన స్రవంతిలో కలిసే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.



