Friday, November 14, 2025
spot_img
Homeఅంతర్జాతీయం"అంబరాన్ని అంటిన సంబరాలు" టొరొంటో తెలుగు కమ్యూనిటీ (TTC) కెనడా టొరంటో లో దసరా మరియు...

“అంబరాన్ని అంటిన సంబరాలు” టొరొంటో తెలుగు కమ్యూనిటీ (TTC) కెనడా టొరంటో లో దసరా మరియు బతుకమ్మ వేడుకలు

www.viraltelugu.com, Online News : టొరొంటో తెలుగు కమ్యూనిటీ (TTC) ఆధ్వర్యంలో కెనడా లోని టొరంటో నగరంలో తెలుగు ప్రజలందరూ ఒక దగ్గరకు చేరి దసరా మరియు బతుకమ్మ సంబరాలను అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో దాదాపు 900కు పైగా తెలుగు వాసులు స్థానిక ఈస్ట్‌డేల్ CVI కాలేజియేట్, ఒషావా, టొరొంటో, కెనడా లో పాల్గొని దసరా పండుగను విజయవంతం చేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉల్లాసంగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా బోర్డు అఫ్ డైరెక్టర్స్ సభ్యులు, శ్రీ ప్రదీప్ కుమార్ కనమర్లపూడి గారు మాట్లాడుతూ కెనడా లోని తెలుగు ప్రజలకు దసరా సంబరాలపై ఉన్న ఆసక్తి ని మరియు బతుకమ్మ పండుగపై ఉన్న భక్తిశ్రద్ధలను కొనియాడారు.

టొరొంటో తెలుగు కమ్యూనిటీ , బోర్డు అఫ్ డైరెక్టర్స్ సభ్యులు, శ్రీ కొత్తూరి సి మధుసూధన్ రావు గారు మాట్లాడుతూ మా అసోసియేషన్ ప్రతి సంవత్సరం దసరా మరియు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని అన్నారు. దసరా , బతుకమ్మ పండుగల విశిష్టతను గురించి శ్రోతలకు చక్కగా వివరించారు. ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.

టొరొంటో తెలుగు కమ్యూనిటీ బోర్డు అఫ్ డైరెక్టర్స్ సభ్యురాలు, శ్రీమతి రమా గాయత్రీ సోంభొట్ల గారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా మన తెలుగు పండుగలని మరియు సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకు వెళ్లడానికి దోహదం చేస్తాయి అని వ్యక్తీకరించారు. మరొక బోర్డు అఫ్ డైరెక్టర్స్ సభ్యులు, శ్రీ రవికిరణ్ కొపల్లె గారు ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవముతో’ అనే విధముగా టొరొంటో తెలుగు కమ్యూనిటీ కృషి చేస్తుందని తెలిపారు.

కార్యక్రమంలో ప్రత్యేక పోటీలు అన్ని వయస్సుల వారికి నిర్వహించబడ్డాయి. ఎన్నో రకాల సరదా ఆటలు నిర్వహించారు. విజేతలకు బోర్డు అఫ్ డైరెక్టర్స్ సభ్యులు, శ్రీ సుధాకర్ రెడ్డి సింగన గారు బహుమతులు అందజేసారు. ముఖ్యంగా 9‑రోజుల నవరాత్రి ఆన్‌లైన్ పోటీలు ఘన విజయంగా నిలిచాయి. ప్రతి రోజు నిర్వహించిన డైలీ క్విజ్‌లో తెలుగు కమ్యూనిటీ సభ్యులు, యువత, పిల్లలు విశేష ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వాళ్ళకి, సత్యభామ కల్లక్షన్స్, కాచిగూడా జంక్షన్, విట్బి మరియు పోప్పిన్ కిడ్స్ వారు బహుమతులు అందజేసారు. నమస్తే సూపర్ మార్కెట్ వారు 5 గ్రాముల వెండి నాణాలు (5) బహుమతిగా అందజేసారు.

ఈ వేడుకలకి ఇతర తెలుగు సంస్థల నుంచి ప్రత్యేక అతిథులు విచ్చేసారు. వారు మాట్లాడుతూ, ఈ సంబరాలని చూడటం ఎంతో ఆనందంగా ఉంది అని కొనియాడారు. అలాగే కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన టొరొంటో తెలుగు కమ్యూనిటీ వారిని అభినందించారు. బోర్డు అఫ్ డైరెక్టర్స్ సభ్యులు, శ్రీ నరేంద్ర బొమ్మినేని గారు, శ్రీ విజయ్‌కుమార్ కోట గారు విచ్చేసిన అతిథుల అందరినీ ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారికి రాఫెల్ డ్రా నిర్వహించి గెలిచిన వారికి ఒక గ్రాము బంగారం బహుమతిగా అందజేయడం జరిగింది. ఈ సంబరాలలో బతుకమ్మ ఆట సుమారు 2 గంటలు ఏకధాటిగా ఆట పాటలతో ఉత్సాహంగా కొనసాగింది.

ఈ వేడుకలను బోర్డు అఫ్ డైరెక్టర్స్ సభ్యులు: శ్రీ ప్రదీప్ కుమార్ కనమర్లపూడి, శ్రీమతి రమా గాయత్రీ సోంభొట్ల, శ్రీ కొత్తూరి సి మధుసూధన్ రావు, శ్రీ నరేంద్ర బొమ్మినేని, శ్రీ రవికిరణ్ కొపల్లె, శ్రీ గిరీష్ బొడ్డు, శ్రీ సుధాకర్ రెడ్డి సింగన, శ్రీ విజయ్‌కుమార్ కోట అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, శ్రీ అనిల్ కుమార్ శ్రీపతి, శ్రీ అనిల్ కుమార్ తెల్లమేకల, శ్రీ దాస్ శంకర్, శ్రీ ధనుంజయ పబ్బతి, శ్రీ కల్యాణ్ నర్సాపురం, శ్రీ కమల్ కిశోర్ నెల్లీ, కరీమ్ సయ్యద్, మాన్సూర్ మహమ్మద్, శ్రీమతి రాధికా దలువై, శ్రీ రామకృష్ణ సామినేని సమిష్టిగా చాలా ఘనంగా నిర్వహించారు.

సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ బతుకమ్మ సంబరాలు, నృత్యాలు, పాటలతో వేడుక రసవత్తరంగా సాగింది. నృత్య మాధురి అకాడమి, శ్రీ సాయిదత్త అకాడమి, స్వాస్తికం డాన్స్ అకాడమి, వారి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రిషా గొల్ల, కీర్తి జక్కంపూడి, కీర్తన గుత్తికొండ, సించన నాగెల్ల, అనన్య బేతి ల కూచిపూడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే సంస్కృతి డ్రమాటిక్స్ వాళ్ళ ప్రహ్లాద నాటకం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

టొరొంటో తెలుగు కమ్యూనిటీ లోకల్ బిజినెస్ లని ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తూ వస్తుంది. ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. స్పాన్సర్లు, వాలంటీర్లు మరియు కమ్యూనిటీ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని బోర్డు అఫ్ డైరెక్టర్స్ సభ్యులు, శ్రీ గిరీష్ బొడ్డు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చివరగా టొరంటో తెలుగు కమ్యూనిటీ బోర్డు అఫ్ డైరెక్టర్స్ సభ్యులు శ్రీ ప్రదీప్ కుమార్ కనమర్లపూడి గారు స్పాన్సర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు

Admin
Admin
Viral Telugu is news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments